NTV Telugu Site icon

Drug Quality Test: పారాసెటమాల్‌తో సహా 52 డ్రగ్స్ నమూనాలు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్..

Drugs

Drugs

Drug Quality Test: భారతదేశంలో విస్తృతంగా వినియోగించబడే మందులుగా పేరున్న పారాసెటమాల్, పాంటోప్రజోల్ వంటి ముందుల ప్రామాణిక నాణ్యత లేనివిగా ఉన్నట్లు తేలింది. కొన్ని ఫార్మా సంస్థలు తయారు చేస్తున్న డ్రగ్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. ఈ మందులతో పాటు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీబయాటిక్ క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయినట్లు సమాచారం. జూన్ 20న జారీ చేసిన డ్రగ్ అలర్ట్ ప్రకారం.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) నాణ్యత పరీక్షల్లో మొత్తం 52 నమూనాలు విఫలమయ్యాయి.

Read Also: Alcohol Kills: ఆల్కహాల్ వల్ల ప్రతీ ఏడాది 30 లక్షల మంది మృతి: డబ్ల్యూహెచ్ఓ

మే నెలలో సీడీఎస్సీఓ జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. ఈ నాణ్యత లేని మందుల్లో 22 హిమాచల్ ప్రదేశ్‌లో తయారయ్యాయి. హిమాచల్‌తో పాటు గుజరాత్, జైపూర్, హైదరాబాద్, వాఘేడియా, వడోదర, ఆంధ్రప్రదేశ్, ఇండోర్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించారు. నాణ్యత టెస్టుల్లో ఫెయిల్ అయిన ఫార్మాస్యూటికల్ కంపెనీలకు రాష్ట్ర డ్రగ్స్ రెగ్యులేటర్లు నోటీసులు పంపిందని, టెస్టుల్లో ఫెయిల్ అయిన శాంపిళ్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సరైన ప్రమాణాల్లో లేని మందుల జాబితాలో మూర్చ, యాంగ్జైటీ రుగ్మతలకు ఉపయోగించే క్లోనాజెపామ్ మాత్రలు, నొప్పి నివారణలో ఉపయోగించే డైక్టోఫెనాక్, యాంటీ హైపర్ టెన్షన్ డ్రగ్ టెల్మిసార్టన్, ఆంబ్రోక్సాల్, శ్వాసకోశ వ్యాధులకు ఉపయోగించే ఫ్లూకోనజోల్, యాంటీ ఫంగల్, మల్టీవిటమిన్లు, కాల్షియం మాత్రలు ఉన్నాయి. గతేడాది హిమాచల్ ప్రదేశ్‌లో తయారైన దాదాపుగా 12 ఔషధాల నమూనాలు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయి.