NTV Telugu Site icon

Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం

Snakebite

Snakebite

Snakebite: దేశంలో పాముకాటు కారణంగా ప్రతీ ఏడాది 50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం చెప్పారు. ప్రతీ ఏడాది భారతదేశంతో 30-40 లక్షల మంది పాముకాలుగకు గురవుతున్నాని ఆయన లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. “బీహార్ అత్యంత పేద రాష్ట్రం, పేదరికం మరియు ప్రకృతి వైపరీత్యాలు రెండింటినీ భరిస్తుంది. భారతదేశం అంతటా, 30 నుండి 40 లక్షల మంది ప్రజలు పాములు కాటుకు గురవుతున్నారు మరియు 50,000 మంది మరణిస్తున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికం, పాముకాటుల్లో ఇది భయంకరమైన మరణాల రేటు” అని ఆయన అన్నారు. 28 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత పెరగడం, వాతావరణ మార్పులు కారణంగా పాముకాటుల ప్రభావాన్ని ఎత్తిచూపుతూనే, ఈ మరణాలనను అరికట్టవచ్చని చెప్పారు.

Read Also: Parampara: శాఖాహారులకు గుడ్‌ న్యూస్‌.. ఇప్పుడు దేశమంతటా ‘పరంపర’..

ఇదిలా ఉంటే జార్ఖండ్‌కి చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. బంగ్లాదేశీ వలసదారులు ఆదివాసీల హక్కుల్ని లాక్కుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జార్ఖండ్‌లో బంగ్లాదేశ్ ప్రజల్ని స్థిరపరిచిందని, ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విధించాలని పిలుపునిచ్చారు. వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని చెప్పారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.