Site icon NTV Telugu

ఢిల్లీలో మళ్లీ ట్రాక్టర్ల ర్యాలీకి రైతు సంఘాల పిలుపు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహదుల్లో సుదీర్ఘంగా తమ పోరాటానికి కొనసాగిస్తూనే ఉన్నారు రైతులు.. కొత్త కొత్త తరహాలో ఎప్పటికప్పుడూ తమ నిరసనలను తెలియజేస్తూ వస్తున్నారు.. ఇక, ఢిల్లీలో మరోసారి భారీ ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం అవుతున్నారు.. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో కొన‌సాగుతున్న రైతుల నిర‌స‌న‌లు ప‌తాక‌స్ధాయికి చేరాయి. రైతుల నిర‌స‌న‌లు చేప‌ట్టి ఏడాది పూర్తవ‌డంతో ఆందోళ‌న‌ల‌ను ముమ్మరం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు.. ఈ నెల 26న 500 మంది రైతులు త‌మ ట్రాక్ట‌ర్లు, ట్రాలీల‌తో పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు.. ఇవాళ జరిగిన సంయుక్త కిసాన్ మోర్చా స‌మావేశంలో రైతు సంఘాల నేత‌లు ఈ మేరకు తీర్మానం చేశారు.. కాగా, గతంలో ఢిల్లీలో రైతులు నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే.. రైతుల శాంతియుత ఆందోళనలో కొన్ని అల్లరిమూకలు దూరి.. రైతుల కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన సంగతి విదితమే.

Exit mobile version