Site icon NTV Telugu

ఆ రోజుతో రైతుల పోరాటానికి ఏడాది..

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రైతులు ఆందోళనలు ఆపేలా లేరు. తమ డిమండ్లనున నేరవేర్చే వరకు ఇంటికి వెళ్లబోమని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతు చట్టాలను రద్దు చేసింనదుకు హర్షం వ్యక్తం చేసినా… తమ డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని వారు అంటున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి నవంబర్‌ 26తో ఏడాది పూర్తి కానున్న తరుణంలో నవంబర్‌ 29న 300మంది రైతులతో కలిసి 30 ట్రాక్టర్లలో ర్యాలీగా ఢిల్లీకి చేరుకుంటారని బీకేయూ నేత రాకేష్‌ టికాయత్‌ తెలిపారు. పూర్తి వివరాలను నవంబర్‌ 26న జరిగే సమావేశంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

తమ డిమాండ్లను నెర‌వేరిస్తేనే తాము ఇంటికి వెళ్తామని తెలిపారు. నూతన సాగు చట్టాలను రద్దు చేసినందుకు హర్షిస్తున్నాం కానీ కనీస మద్దతు ధర, కేంద్ర హోం శాఖ మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించడంతోపాటు ఆందోళనలో అమరులైన 700 మంది రైతులకు నష్టపరిహారం, విద్యుత్‌ సవరణ బిల్లు, రైతుల పై పెట్టిన కేసుల ఉపసంహరణ తదితర డిమాండ్లను జనవరి 26లోగా నెర‌వేర్చాల‌ని అప్పుడే ఇళ్లకు తిరిగి వెళ్తామని టికాయత్‌ స్పష్టం చేశారు.

Exit mobile version