NTV Telugu Site icon

Gujarat: గుజరాత్‌లో విషాదం.. ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు మృతి

Gujarat

Gujarat

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కచ్ఛ్‌లోని ఆగ్రోటెక్ కంపెనీలో బురద ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు కార్మికులు బుధవారం మరణించారు. క్లీన్ చేస్తుండగా ఒకరు అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు.. అతనిని రక్షించడానికి మరో ఇద్దరు కార్మికులు దిగారు. అనంతరం వారు కూడా స్పృహతప్పి పడిపోయారు. మరికొద్ది సేపటికి మరో ఇద్దరు వ్యక్తులు ట్యాంక్‌లోకి ప్రవేశించారు. ఐదుగురు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు వదిలారు. గత అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Supreme Court: ఇక చట్టం గుడ్డిది కాదు… న్యాయదేవత కళ్లగంతలు తొలిగాయ్!

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కాండ్ల పోలీసులు ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులు సిద్ధార్థ్ తివారీ, అజ్మత్ ఖాన్, ఆశిష్ గుప్తు, ఆశిష్ కుమార్, సంజయ్ ఠాకూర్‌లుగా గుర్తించారు. ఇక ఘటనపై కంపెనీ స్పందించింది. ఐదుగురు మృతిచెందడం పట్ల విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై విచారణ కూడా జరుపుతామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Surinder Choudhary: జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎంగా సురీందర్ చౌదరి