Site icon NTV Telugu

Pune accident: పూణెలో కారు ప్రమాదం.. ఐదుగురు తెలంగాణ యువకుల మృతి

Jeke

Jeke

మహారాష్ట్రలోని పూణె నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువత టూరిజం కోసం మహారాష్ట్రకు వెళ్లారు. భిగ్వాన్ సమీపంలో ఇంటికి తిరిగి వస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి కారు బోల్తా పడింది. సమీపంలో ఉన్న వారు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వారేనని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి

భార్ఘవ్ ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర పూణె-షోలాపూర్ జాతీయ రహదారిపై వాహనం బోల్తా పడింది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో డీల్ దలాజ్ (తా. ఇందాపూర్) సమీపంలోని భిగ్వాన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు. మృతులు రఫీక్ ఖురేషీ (వయస్సు 34), ఇర్ఫాన్ పటేల్ (వయస్సు 24), మెహబూబ్ ఖురేషి (వయస్సు 24), ఫిరోజ్ ఖురేషి (వయస్సు 27). మృతులు నారాయణఖేడ్ జిల్లా.. తెలంగాణ ప్రాంత వాసులు. సయ్యద్ ఇస్మాయిల్ అమీర్ (వయస్సు 23) అనే యువకుడు తీవ్రంగా గాయపడి  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాహనాలు జారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వాహనంపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం జాక్ పాట్ కొట్టాడు.. ఏకంగా అలాంటి సినిమాతో!!

Exit mobile version