NTV Telugu Site icon

Truck Blast In Jaipur: జైపూర్‌లోని పెట్రోల్‌ బంక్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

Jaipur

Jaipur

Truck Blast In Jaipur: రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్‌లోని భంక్రోటా ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌లో ఈ రోజు (డిసెంబర్ 20) ఉదయం భారీ అగ్ని ప్రమాద చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్‌ వద్ద ఆపి ఉంచిన సీఎన్‌జీ ట్యాంకర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం నెలకొంది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్‌ నుంచి పక్కనే వాహనాలకు వ్యాప్తి చెండదంతో పలు వాహనాలు మంటల్లో కాలిబుడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా.. మరో 12 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి 22 ఫైర్‌ ఇంజిన్లు చేరుకున్నాయి.

Read Also: Mohan Babu: మళ్లీ అజ్ఞాతంలోకి మంచు మోహన్ బాబు!

భారీగా చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదంతో ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి.. దీంతో, పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ హస్పటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రమాట ఘటన స్థలికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కూడా వెళ్లనున్నారు.

Show comments