Site icon NTV Telugu

COVID 19: కరోనా ఫోర్త్‌ వేవ్ ముప్పు ఉందా..?

covid

covid

దేశంలో కరోనా నాలుగో వేవ్‌ రాకపోవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వైరస్ సోకడంతో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించింది. ఐఐటీ కాన్పూర్‌ సూత్ర మోడల్‌ ప్రకారం… 90 శాతం మంది భారతీయులకు ఈ సహజ నిరోధకత లభించినట్లు వెల్లడించింది. ఇటీవల కేసులు పెరిగినా… ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తే, నాలుగో వేవ్‌కు అవకాశం ఉంటుంది. అంతేకానీ… వైరస్ తీవ్రతను తగ్గించుకునేందుకు టీకా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: Russia-Ukraine war: రష్యా భీకర పోరు.. మృతదేహాల గుట్టలు..!

కరోనా వైరస్‌ను నిరోధించడానికి ఇప్పటివరకు టీకాలను ఇంజెక్షన్‌ రూపంలోనే వచ్చాయి. తాజాగా నోటిద్వారా తీసుకునే టీకాపైనా ప్రయోగాలు జరుగుతున్నాయి. నోటి ద్వారా తీసుకునే టీకా వ్యాధి నుంచి రక్షణ కల్పించడం, గాలిలో వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలోనూ దోహదపడుతోందని తాజా అధ్యయనంలో తేలింది. జంతువులపై జరిపిన ప్రయోగాల్లో… సానుకూల ఫలితాలు వచ్చాయి. నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ను… అమెరికాలోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థ వాక్సార్ట్‌, లవ్‌లేస్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సంస్థలు రూపొందించాయి. జంతువులపై ప్రయోగించడంతో… రక్తం, ఊపిరితిత్తుల్లో యాంటీబాడీ ప్రతిస్పందనలు గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు. వైరస్‌ సోకని వాటితో పోలిస్తే వైరస్‌కు గురైన వాటిల్లో లక్షణాలు తక్కువ ఉన్నట్లు తేల్చారు. వైరస్‌ను శ్వాసమార్గంలోనే అడ్డుకోవడం వల్ల దగ్గు, తుమ్ము ద్వారా వైరస్‌ గాలిలో చేరడం తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Exit mobile version