NTV Telugu Site icon

Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో భారీ హిమపాతం.. 47 మంది సమాధి

Uttarakhandavalanche

Uttarakhandavalanche

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు భారీ హిమపాతం.. దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది. ఎటుచూసినా భారీగా మంచు పేరుకుపోయింది. చమోలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకుని 47 మంది కార్మికులు సమాధి అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  10 మంది కార్మికులు మాత్రం సురక్షితంగా బయట పడినట్లు సమాచారం.

రాష్ట్ర విపత్తు  దళం (SDRF), జాతీయ విపత్తు  దళం (NDRF), జిల్లా యంత్రాంగం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు సంఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. భారత వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌తో సహా అనేక కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి వరకు చాలా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఇదిలా ఉంటే భారీ వర్షాలు కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీరుతో నిండిపోయాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో అండప్‌పాస్‌లు మూసేశారు. మరోవైపు రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. గత 12 గంటలుగా కుండపోత వర్షాలు, భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.