NTV Telugu Site icon

Mobile Usage: మొబైళ్లకు అతుక్కుపోతున్న పిల్లలు.. రోజుకు 4 గంటలు సెల్‌ఫోన్ లోనే..

Mobile Usage

Mobile Usage

Mobile Usage: ఇటీవల కాలంలో పిల్లల్లో మొబైల్ ఫోన్ల వాడకం పెరిగింది. అన్నం తినడానికి మారం చేస్తున్నారనో..తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లను ఇస్తున్నారు. అయితే ఇదే అలవాటుగా మారి పిల్లలు దానికి అడిక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం పిల్లలు ఫిజికల్ గేమ్స్ ఆడేందుకు ఇష్టపడటం లేదు, స్కూల్ నుంచి వచ్చిందంటే చాలు సెల్ ఫోన్లపై పడుతున్నారు. యూట్యూబ్, గేమ్స్ ఇలా వాటితో కాలక్షేపం చేస్తున్నారు.

Read Also: Canada: కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌పై భారత హ్యాకర్ల దాడి..?

ఇదిలా ఉంటే తాజాగా ఓ పిల్లల రోజూ వారీ సెల్ ఫోన్ వినియోగంపై హ్యపీనెజ్జ్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో 12 ఏళ్ల లోపు ఉన్న 42 శాతం పిల్లలు రోజుకు 2 నుంచి 4 గంటల పాటు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని తేలింది. 12 ఏళ్లకు పైబడిని పిల్లల్లో 47 శాతం మంది పిల్లలు ఫోన్లను చూస్తున్నారని సర్వే వెల్లడించింది.అయితే చాలా విషయాల్లో పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేసినప్పటికీ, ఫోన్ల విషయంలో మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారని సర్వే తెలిపింది.

ఇదిలా ఉంటే 69 శాతం పిల్లలు సొంత ఫోన్లు, ట్యాబ్‌లను కలిగి ఉన్నారని సర్వే తెలిపింది. 12 ఏళ్ల పైబడిన పిల్లలు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ ను వాడుతున్నారని చెప్పింది. 74 శాతం పిల్లలు యూట్యూబ్ చూస్తుంటే, 12 ఏళ్లకు పైబడిన పిల్లలు గేమింగ్ కోసం సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారని వెల్లడించింది. ప్రస్తుతం విద్య నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు ప్రతీది డిజిటల్ గా మారడంతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగం పిల్లలకు అవసరంగా మారిందని హ్యపీనెట్జ్ సీఈఓ రిచా సింగ్ తెలిపారు.