NTV Telugu Site icon

44 రోజులల్లో 40 శాతం మరణాలు… ఆందోళనలో అధికారులు 

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.  రోజువారి కరోనా మరణాల సంఖ్య నాలుగు వేలకు పైగా నమోదవుతున్నాయి.  కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  పంజాబ్ లో ఈ పరిస్థితి దారుణంగా ఉన్నది.  పంజాబ్ లో 44 రోజుల్లో 40 శాతం మరణాలు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.  పంజాబ్ లో మార్చి 41 నాటికీ 6868 కరోనా మరణాలు ఉంటె, మే 14 వరకు ఆ సంఖ్య 11,477కి చేరింది.  అంటే 44 రోజుల్లో 4609 మంది కరోనాతో మృతి చెందారు.  పంజాబ్ లో ప్రతి రోజు కరోనాతో 100 మందికి పైగా మరణిస్తున్నారు.  మొదటి వేవ్ ను సమర్ధవంతంగా కంట్రోల్ చేసిన పంజాబ్ రాష్ట్రంపై సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున విరుచుకుపడిందని చెప్పొచ్చు.