Site icon NTV Telugu

Bus Overturn: 40 మందితో వెళ్తున్న బస్సు బోల్తా..

Bus Overturns In Chhattisgarh

Bus Overturns In Chhattisgarh

Bus Overturns in Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. మోహ్లా మన్‌పూర్‌లో బస్సు బోల్తా పడింది. చిన్నారులతో సహా 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. దోండి లోహరా ప్రాంతం నుంచి కురేత గ్రామానికి బయలుదేరిన బస్సు శుక్రవారం బోల్తా పడటంతో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను అంబగఢ్ చౌకీలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రయాణికులంతా అంబాగర్ చౌకీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని విచారపూర్ గ్రామంలో నివసించే మహర్ కమ్యూనిటీకి చెందిన గ్రామస్థులుగా అధికారులు తెలిపారు.

Read Also: Amit Shah: బీజేపీకి వేసే ప్రతీ ఓటు పీఎఫ్ఐ నుంచి కర్ణాటకను కాపాడుతుంది..

ప్రస్తుతం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 13 మంది పిల్లలు మరియు 27 మంది మహిళలు చికిత్స పొందుతున్నారని, తీవ్రంగా గాయపడిన ముగ్గురు మహిళలను రాజ్‌నంద్‌గావ్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేశామని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ధుర్వే తెలిపారు.

Exit mobile version