NTV Telugu Site icon

JK Polls: రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి

Jkpolls

Jkpolls

జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్ సిబ్బంది.. ఈవీఎంలతో పోలింగ్ బూతులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చదవండి: Natasa Stankovic: హార్దిక్ నుండి విడిపోయిన తర్వాత నటాషా ఏం చేస్తుందో తెలుసా..? వీడియో వైరల్

జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 18, 25 తేదీల్లో 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇక అక్టోబర్ 1న 40 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. రెండు విడతల్లో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి గొడవలు, ఉద్రిక్తతలు లేకుండా కూల్‌గా ముగిశాయి. మంగళవారం జరిగే పోలింగ్ కోసం కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు అన్ని విధాలా వసతులు కల్పించారు. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Bomb Threat: తమిళనాడులోని 3 విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్..