కోర్సులను ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవుతోంది.. గతంలో ఇలాంటి ప్రయత్నం చేసినా.. కొన్ని విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేసేందుకు పూనుకుంది.. దీంతో.. మూడేళ్ల డిగ్రీకి బదులు కొత్త డిగ్రీ కోర్సులు అమల్లోకి రానున్నాయి.. అయితే, పీజీ ఒకే సంవత్సరంలో పూర్తి చేయొచ్చు.. ఎందుకంటే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు.. రెండేళ్లకు బదులు ఏడాది కాలపరిమితితో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వెసులుబాటు ఉంది.. అయితే, మొత్తంగా మూడేళ్ల డిగ్రీ మాయం అవుతాయంటే.. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు.. ఎందుకంటే.. ఓవైపు మూడేళ్ల డిగ్రీ కోర్సులను నిర్వహిస్తూనే, నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించే అవకాశం కల్పిస్తోంది కేంద్రం.
డిగ్రీ నాలుగేళ్లు.. పీజీ ఒకే ఏడాది..!

students