NTV Telugu Site icon

Delhi Tunnel Robbery: పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. కారుని అడ్డగించి మరీ దోపిడీ

Delhi Tunnel Robber

Delhi Tunnel Robber

4 Men Rob Car At Gunpoint In Delhi Tunnel: ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఓ కారుని అడ్డగించి, గన్‌తో బెదిరించి, డబ్బులు దోచుకుపోయారు. ఢిల్లీలోని 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ప్రగతి మైదాన్ టన్నెల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు ఒక క్యాబ్ బుక్ చేసుకొని, గురుగ్రామ్‌కి బయలుదేరారు. రూ.2 లక్షల డబ్బులతో నిండిన ఒక బ్యాగ్‌ని డెలివరీ చేయడానికి వాళ్లు క్యాబ్‌లో వెళ్తున్నారు. ఆ క్యాబ్ ప్రగతి మైదాన్ టన్నెల్‌లోకి ప్రవేశించగానే.. రెండు బైక్‌ల మీద నలుగురు దుండగులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు.

Noodles Omelette : పిల్లలు ఇష్టంగా తినే నూడిల్స్ ఆమ్లెట్ ను ఎలా తయారు చెయ్యాలంటే?

ఒక చోట ఆ కారుని అడ్డగించి, ఇద్దరు బైక్‌ల నుంచి దిగారు. ఒకరు గన్‌తో బెదిరిస్తుండగా, మరొకరు డబ్బులతో నిండిన బ్యాగ్‌ని తీసుకున్నాడు. బ్యాగ్ చేతికి అందగానే.. అక్కడి నుంచి ఆ నలుగురు ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ టన్నెల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. దొంగల్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుండుగులు క్యాబ్‌లోని ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటి నుంచి వెంబడిస్తున్నారు? ఇందులో అంతర్గత వ్యక్తుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. టన్నెల్‌ను పర్యవేక్షించడానికి 15 మంది పోలీసులను రక్షణగా ఉంచామని.. ఘటన జరిగినప్పుడు టన్నెల్ మొదట్లో, చివర్లో ఇద్దరు చొప్పున పోలీసులు ఉన్నారని తెలిపారు. దోషులను పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

Vikarabad Crime: కోరిక తీర్చమని వివాహితని అడిగాడు.. దాబాకు తీసుకెళ్లి, మందు తాగిపించి..

ఈ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. దేశ రాజధానిలో లా అండ్ ఆర్డర్ నిర్వీర్యమయిందని ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినెయ్ కుమార్‌ సక్సేనా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పుకొని.. ఢిల్లీ ప్రజల్ని సురక్షితంగా ఉంచే సామర్థ్యం ఉన్న వ్యక్తులకు బాధ్యతల్ని అప్పగించాలన్నారు. ఢిల్లీని కాపడటంలో కేంద్రం విఫలమైందన్న ఆయన.. మీకు చేతకాకపోతే తమకు బాధ్యతలు ఇవ్వాలన్నారు. నగర ప్రజలకు ఎలా రక్షణ కల్పించాలో తాము చూపిస్తామని ఛాలెంజ్ చేశారు.