Tesla crash: టెక్నాలజీ, సేఫ్టీకి మారుపేరైన ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కార్లు ఇటీవల క్రాష్ అవుతున్న ఘటనల్ని చూస్తూనే ఉన్నాం. తాజాగా కెనడాలో టెస్లా కారు క్రాష్ అయ్యి ఇండియాకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. టొరంటో సమీపంలో అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు భారతీయులు మరణించారు. అయితే, బాధితులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఆ సమయంలో టెస్లా సెల్ఫ్ డ్రైవ్ మోడ్‌లో ఉందా..? అనేది స్పష్టంగా తెలియలేదు.
Read Also: Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 7 మంది షూటర్లు అరెస్ట్
మరణించిన వారిలో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన 30 ఏళ్ల కేతా గోహిల్, 26 ఏళ్ల నిల్ గోహిల్ ఉన్నారు. వారు మరో ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తుండగా, కారులో మంటలు చెలరేగడంతో వారు కూడా మరణించారు. ఇటీవలే కెనడా పౌరసత్వం పొందిన వ్యక్తి కూడా ఈ ఘటనలో మరణించాడు. కారు డివైడర్‌ని ఢీకొట్టడంతో బ్యాటరీలు పేలి మంటలు అంటుకున్నాయి. కారులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల మహిళ, కారు నుంచి బయటకు వచ్చి, వాహనదారుల సాయం కోరినట్లు నివేదికలు చెప్పాయి. ప్రస్తుత ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పలువురు కారు అద్దాలను పగలగొట్టి సాయం చేసే ప్రయత్నం చేశారు.