Site icon NTV Telugu

Oil Tanker Accident: ముంబై-పూణే హైవేపై బోల్తాపడిన పెట్రోల్ ట్యాంకర్.. నలుగురు దుర్మరణం..

Petrol Tanker Overturns

Petrol Tanker Overturns

Oil Tanker Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడటంతో నలుగురు మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ హైవేపై చోటు చేసుకుంది. లోనావాలకు సమీపంలో ఓవర్ బ్రిడ్జ్ పై ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఒక బండరాయిని ఢీకొట్టి బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యటు చేపట్టారు.

Read Also: Adipurush: థియేటర్లో ఆదిపురుష్ సినిమా చూసేప్పుడు పాటించాల్సిన నియమాలివేనట.. వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్!

బ్రిడ్జ్ పై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్యాంకర్ లో ఇంధనం ఉండటంతో దాదాపుగా 10 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ కు అంటుకున్న మంటలు బ్రిడ్జ్ దిగువ భాగం వరకు చేరుకున్నాయి. ఈ ఘటనలో వంతెన కింద బైక్ పై వెళ్తున్న 12 ఏళ్ల చిన్నారి మరణించింది. ఈ ప్రమాదంలో బాలుడి తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

Exit mobile version