NTV Telugu Site icon

Pollution: ఈ నగరాలకు ఏమైంది.. ప్రతీ ఏడాది 33 వేల మరణాలు..

Pollution

Pollution

Pollution: భారతదేశంలో కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నగరాల్లో కాలుష్యం కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నట్లు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దేశంలోని 10 నగరాల్లో ప్రతీ ఏడాది 33,000 మంది మరణిస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలో స్వచ్ఛమైన గాలి ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచించిన ప్రతీ క్యూబిన్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. స్వచ్ఛమైన వాయు ప్రమాణాలను భారత్ డబ్ల్యూహెచ్ఓ మర్గదర్శకాలకు సరిపోయేలా చూసుకోవడం ద్వారా తమ పౌరుల్ని రక్షించుకోవాలని సూచించింది.

READ ALSO: Sprouted Beans : ఉదయం పూట అల్పాహారంగా మొలకలు తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

10 నగరాల్లో PM2.5 ఎక్స్‌పోజర్ మరియు 2008-2019 మధ్య రోజూ వారీ మరణాల గణనలపై డేటాను ఉపయోగించారు. ప్రస్తుత భారతీయ వాయు నాణ్యత ప్రమాణాల కంటే తక్కువ స్థాయి వాయు కాలుష్యం కూడా దేశంలో రోజువారీ మరణాల రేటును పెంచుతుందని అధ్యయనం కనుగొంది. దేశంలోని 10 నగరాలు-అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే, సిమ్లా మరియు వారణాసిలో, సంవత్సరానికి 33,000 మరణాలు చోటు చేసుకుంటున్నాయని, డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న వాయుకాలుష్య స్థాయిలే ఇందుకు కారణమని చెప్పింది.

ముంబై, బెంగళూరు, కోల్‌కతా మరియు చెన్నై వంటి నగరాల్లో అధికంగా కాలుష్యం లేదని చెప్పుతున్నప్పటికీ గణీయమైన మరణాలు చోటు చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. భారతదేశం తన జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలని సూచించింది. 2008 మరియు 2019 మధ్య, ఈ మొత్తం 10 నగరాల్లో మొత్తం మరణాలలో 7.2% (ప్రతి సంవత్సరం దాదాపు 33,000) కాలుష్యం కారణంగా ఏర్పడిన మరణాలుగా చెప్పింది.ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక్కడ ప్రతీ ఏడాది 12,000 మంది మరణిస్తున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో వారణాసి, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూర్ వంటి నగరాలు ఉన్నాయి. సిమ్లాలో అత్యల్ప వాయు కాలుష్యం ఉన్నట్లు చెప్పింది.