NTV Telugu Site icon

Shocking Incident: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ర్యాపిడో డ్రైవర్.. బైక్ పై నుంచి దూకేసిన వైనం..వీడియో వైరల్

Bengaluru Rapido Incident

Bengaluru Rapido Incident

Bengaluru woman jumps off Rapido bike: బెంగళూర్ తో దారుణం జరిగింది. 30 ఏళ్ల మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఆ డ్రైవర్ నుంచి తప్పించుకునేందుకు బైక్ పై నుంచి దూకేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 21 రాత్రి, ఓ మహిళ ఇందిరా నగర్ నుంచి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. రాత్రి 11.10 గంటలకు ఆమెను తీసుకెళ్లడానికి ర్యాపిడో బైక్ డ్రైవర్ వచ్చాడు. అయితే ఆ సమయంతో ఓటీపీని చూసే క్రమంతో తన మొబైల్ ఫోన్ లాక్కున్నట్లుగా మహిళ ఆరోపించింది. ఇదిలా ఉంటే తప్పుడు మార్గంలో బైక్ ను పోనివ్వడమే కాకుండా, డ్రైవర్ మహిళను అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు.

Read Also: Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది పోలీసుల మృతి

ఈ క్రమంతో మహిళ తనను తాను రక్షించుకునేందుకు కదులుతున్న బైక్ పై నుంచి దూకేసింది. 30 ఏళ్ల మహిళా ఆర్కిటెక్ట్, డ్రైవర్ ను సరైన మార్గంలో వెళ్లాల్సిందిగా కోరుతున్నప్పటికీ వినిపించుకోలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైడ్ సమయంలో అతను తాగి ఉన్నట్లుగా మహిళ గుర్తించింది. బైక్ పై నుంచి దూకుతున్న వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. నిందితుడుని ఆంధ్రప్రదేశ్ కు చెందిన దీపక్ రావుగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ఐపీసీ సెక్షన్లు 354(మహిళ నిరాడంబరతకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 366 (కిడ్నాప్, అపహరణ లేదా వివాహాన్ని బలవంతం చేయడానికి స్త్రీని ప్రేరేపించడం మొదలైనవి) కింద కేసు నమోదు చేశారు.