Site icon NTV Telugu

Manipur Violence: 3 నెలల్లో 30 మంది మిస్సింగ్‌.. మణిపూర్‌లో కొనసాగుతున్న హింస

Manipur Violence

Manipur Violence

Manipur Violence: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఏమి జరుగుతుందో పూర్తి స్థాయిలో బయటికి తెలియడం లేదు. మొన్నటి వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన ఆకృత్యాలు బయటికి రాలేదు. ఇప్పుడు కొత్తగా గడచిని 3 నెలల్లో పదుల సంఖ్యలో ప్రజలు కనిపించకుండా పోయారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మణిపూర్‌లో మహిళలపై జరిగిన వేధింపులు, అత్యాచారం, హత్య వీడియోపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. మహిళలపై జరుగుతున్న హింసపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ రాష్ట్ర పోలీసులపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ఇప్పుడేమో మిస్సింగ్‌ కేసులు బయటికొచ్చాయి. మణిపూర్‌లో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో జరిగిన సంఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. తాజాగా మరో భయంకరమైన విషయం బయటకు వచ్చింది. మణిపూర్‌‌లో మిస్సింగ్ కేసులు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఘర్షణలు ప్రారంభమైన మే 3 నుంచి ఇప్పటివరకు 30 మంది అదృశ్యం అయినట్లు తెలుస్తోంది. వీరంతా ఎక్కడికి వెళ్లారు. అసలు ఈ మిస్సింగ్ కేసులపై పోలీసులు ఏం చేస్తున్నారన్న దానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మణిపూర్‌లో శాంతి భద్రతలను అదుపు చేయలేకపోయారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై.. ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మహిళలను నగ్నంగా చేసి ఊరేగింపు తర్వాత వారిలో ఒకరిపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ అమానుష ఘటనలో మణిపూర్ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read also: Minister Satyavathi: వరద నష్టాలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం

మణిపూర్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న మే 3 వ తేదీ తర్వాత నుంచి ఇప్పటి వరకు మొత్తం 30 మంది జాడ కనిపించకుండా పోయిందని తెలుస్తోంది. ఈ 30 మందిలో యువత నుంచి మధ్య వయసు ఉన్న వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ప్రారంభమైన కొన్ని రోజులకే సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ అయిన 47 ఏళ్ల సమరేంద్ర సింగ్‌ కనిపించకుండా పోయాడని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమరేంద్ర సింగ్ జాడ ఇప్పటికీ దొరకలేదని.. అతని స్నేహితుడు తెలిపాడు. ఘటనలకు సంబంధించిన వార్తలు కవర్ చేసేందుకు సమరేంద్ర సింగ్.. కాంగ్‌పోక్పీ ప్రాంతం వైపు వెళ్లాడని.. అప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. పరిస్థితులు అదుపులోకి వచ్చాయని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జులై 6 వ తేదీన మణిపూర్‌లో కొన్ని ఆంక్షలను సడలించారు. ఈ నేపథ్యంలోనే నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి వెళ్లిన 17 ఏళ్ల హిజామ్ లువాంగ్బీ.. ఆచూకీ దొరకడం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తన స్నేహితుడితో కలిసి హిజామ్ లువాంగ్బీ.. బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి వారి ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని చెప్పారు. అయితే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వారు ఇంఫాల్‌ సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అయితే వారిద్దరి ఫోన్లు రెండు వేర్వేరు జిల్లాల్లో స్విచ్ఛాఫ్ అయినట్లు తెలపడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

Read also: Haryana Violence: అలర్ల బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన సీఎం

సమరేంద్ర సింగ్, హిజామ్ లువాంగ్బీతోపాటు హింసాత్మక ఘటనలు మొదలైనప్పటి నుంచి.. ఈ 3 నెలల కాలంలో 30 మంది కనిపించకుండా పోయారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరందరు మిస్సింగ్ కావడం వెనక ఒక్కో కారణం ఉందని చెప్పారు. అదృశ్యమైన వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. అయినా ఇప్పటివరకు వారి జాడ మాత్రం కనుగొనలేకపోయామని తెలిపారు. అయితే పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. అదృశ్యమైన వారి సంఖ్య 30 మందిగా ఉన్నప్పటికీ.. ఫిర్యాదు చేయకుండా చాలా మంది ఉంటారని.. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మే 3 వ తేదీ నుంచి ఇప్పటివరకు మణిపూర్‌లో వివిధ ఫిర్యాదులతో 6 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు బీరెన్ సింగ్ ప్రభుత్వం వెల్లడించింది.

Exit mobile version