NTV Telugu Site icon

RAJASTHAN: మూడేళ్ల పాపను కారులో మరిచి వెళ్లిన తల్లిదండ్రులు.. చివరకు విషాదం మిగిలింది..

Car Incident

Car Incident

RAJASTHAN: తల్లిదండ్రుల నిర్లక్ష్యం మూడేళ్ల పాప ప్రాణాలను తీసింది. పెళ్లి వేడకకు వెళ్లిన దంపతులు తమ పిల్లలు కార్ దిగారా..? లేదా.? అని చూసుకోకపోవడంతో పాప కారులోనే చిక్కుకుని మరణించింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ కోటాలో చోటు చేసుకుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. బాలిక తండ్రి ప్రదీప్ నగర్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కారులో జోరావర్‌పురా గ్రామంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. తల్లి, పెద్ద కూతురు కారు నుంచి దిగగా, మూడేళ్ల బాలిక గోర్విక అందులోనే ఉండిపోయింది. ప్రదీప్ కారులో తన కూతురు ఉందనే విషయం తెలియక కారును ఓ చోట పార్కింగ్ చేసి, లాక్ వేశాడు.

Read Also: Vegetable oils: పదే పదే వంటనూనెను వేడి చేస్తున్నారా..? అయితే మీరు క్యాన్సర్ రిస్కులో పడ్డట్లే..

ఆ తర్వాత భార్య, భర్తలు వేర్వేరు గ్రూపులతో కలిసి పోయారు. రెండు గంటల తర్వాత ఇద్దరు కలిసిన సందర్భంలో చిన్న కూతురు గురించి ఆరా తీశారు. గోర్వికని తండ్రి తీసుకువస్తాడని భార్య భావించగా.. భార్య తీసుకెళ్లిందని భర్త భావించాడు. కారులో ఉందనే అనుమానంతో ఉందని వెతగా, అప్పటికే ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వైద్యులు పరీక్షించి మరణించినట్లు తెలిపారు. ఈ విషాదంపై పోలీసు కేసు పెట్టేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు.

Show comments