Site icon NTV Telugu

Dal lake: ప్రసిద్ధ దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. హౌస్‌ బోట్లు కాలి ముగ్గురు మృతి

Srinagar

Srinagar

Dal lake: ప్రముఖ పర్యాటక ప్రాంతం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులోని బోట్‌హౌజులను అగ్ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బంగ్లాదేశ్‌కి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 5 హౌజ్ బోట్లు ధ్వంసమయ్యాయి.

Read Also: PM Modi: మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ.. ఓదార్చిన ప్రధాని మోడీ

కాలిపోయిన మృతదేహల్లో ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్నారని, మిగిలిన మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. అగ్నిప్రమాదంలో ఐదు హౌస్‌బోట్‌లు, వాటికి అనుబంధంగా ఉన్న గుడిసెలు సహా కోట్లాది రూపాయల విలువైన ఆస్తి కూడా దగ్ధమైంది. ప్రమాద వార్త తెలియగానే.. రెస్య్కూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నట్లు ఫైర్ ఆఫీసర్ ఫరూఖ్ అహ్మద్ వెల్లడించారు. కొంతమంది పర్యాటకులను రక్షించామని ఆయన తెలిపారు. హౌజ్ బోట్లలో చెలరేగిన మంటలు వెనువెంటనే పక్కన ఉన్నవాటికి వ్యాపించాయని, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

Exit mobile version