NTV Telugu Site icon

Bomb Threat: తమిళనాడులోని 3 విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్..

Tamilnadu

Tamilnadu

Bomb Threat: తమిళనాడు రాష్ట్రంలోని మూడు స్కూల్స్ కు బాంబు బెదిరింపుల మెయిల్స్ వచ్చాయి. వీటిలో మధురైలోని కేంద్రీయ విద్యాలయం, జీవన్ స్కూల్, వేల అమ్మాల్ పాఠశాలకు ఈరోజు (సోమవారం) బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఆ పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అలర్ట్ అయినా స్కూల్స్ యాజమాన్యం వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: New Rules: క్రెడిట్, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పులు.. రేపట్నుంచే అమల్లోకి..!

ఇక, పాఠశాలల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్‌ స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ సహాయంతో ఆయా స్కూళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి స్టూడెంట్స్ ను వాళ్ల నివాసాలకు పంపించేశారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ మెయిల్‌ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.