NTV Telugu Site icon

Bomb Threat In Delhi: ఢిల్లీలోని మరో 3 పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Delhi

Delhi

Bomb Threat In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూల్స్ కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. పశ్చిమ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, మయూర్ విహార్‌లోని సల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్‌ పాఠశాల సహా పలు విద్యాసంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 13) తెల్లవారుజామున బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్వ్కాడ్ తో అక్కడకు చేరుకుని సోదాలు చేవారు. ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ-మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మెయిల్ ఐపీ అడ్రస్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Read Also: D Gukesh: చరిత్రకు చెక్‌మేట్‌ పడింది, నువ్వు ఓ అద్భుతం.. గుకేశ్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు!

అయితే, ఢిల్లీలో ఇలా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. నాలుగు రోజుల క్రితం (డిసెంబరు 9) కూడా 40కి పైగా పాఠశాలలకు ఈ తరహా వార్నింగ్ వచ్చాయి. స్కూల్స్ ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చాం, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని దుండగులు బెదిరించారు. ఇక, అది నకిలీదని ఆ తర్వాత ప్రైమరీ విచారణలో తేలింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో స్కూల్స్ కు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. ఇక, అక్టోబరులో రోహిణి ఏరియాలోని ఓ సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ బయట పేలుడు తీవ్ర కలకలం రేపుతుంది.

Show comments