NTV Telugu Site icon

Road Accident: కోతి వల్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల దుర్మరణం..

Raod Accident

Raod Accident

Road Accident: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు మరణించారు. మొరాదాబాద్-అలీఘర్ జాతీయ రహదారిపై కారు ట్యాంకర్‌ని ఢీకొట్టింది. మొరాదాబాద్‌లోని దోమ్‌ఘర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తులను యాక్సిస్ బ్యాంకు మేనేజర్ సౌరభ్ శ్రీవాస్తవ, క్యాషియర్ దివ్యాన్షు మరో వ్యక్తిని అమిత్‌గా గుర్తించారు. చందేసి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Arvind Kejriwal : సీఎం పదవి నుంచి కేజ్రీవాల్‎ను తప్పించండి.. పిటిషన్‎ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

రోడ్డుపై కోతిని రక్షించేందుకు వారు ప్రయాణిస్తున్న కారును స్లో చేయడంతో ముందు వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. దీంతో ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు కారును కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రోడ్డుపై అకస్మాత్తుగా కోతి కనిపించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు

Show comments