Site icon NTV Telugu

Earthquake: ఒకే రోజు రెండు ప్రాంతాల్లో.. కార్గిల్, మేఘాలయాల్లో భూకంపాలు..

Earthquake

Earthquake

Earthquake: దేశంలో ఒకే రోజు రెండు ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి. లడఖ్‌లోని కార్గిల్‌లో ఈ రోజు మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

Read Also: Candida Auris: అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్..

ఈశాన్య రాష్ట్రం మేఘాలయా భూ ప్రకంపనలతో వణికింది. రాష్ట్రంలోని తూర్పు గారో హిల్స్‌లో ఆదివారం మధ్యాహ్నం రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రంతో భూకంపం వచ్చినట్లు ఎన్సీఎస్ తెలిపింది. మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రకంపనలు నమోదయ్యాయి. భూమికి 12 కిలోమీటర్లలో భూకంపం వచ్చింది.

Exit mobile version