NTV Telugu Site icon

సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు.. సుప్రీంకోర్టు సీజేకు విద్యార్థుల‌ లేఖ‌

Supreme Court

కరోనా సెకండ్ వేవ్ క‌ల్లోలం కార‌ణంగా వాయిదా పడ్డ పరీక్షల‌ను తిరిగి నిర్వహిచేందుకే సిద్ధ‌మ‌వుతోంది సీబీఎస్ఈ బోర్డు.. అయితే పరీక్షల పాటర్న్ కరోనా సంక్షోభం నేపధ్యంలో కాస్త మారనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు విధివిధానాల్ని పరిశీలిస్తున్న‌ట్టుగా స‌మాచారం.. అయితే, సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 297 మంది విద్యార్థులు… పరీక్షలు భౌతికంగా నిర్వహించాలని తీసుకున్ననిర్ణయాన్ని క్వాష్ చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.. విద్యార్థుల మూల్యాంకనంకి గతేడాది అవలంభించిన ప్రత్యామ్నాయ విధానాలను అవలంభించాలి.. ఈ అంశాన్ని సుమోటో గా స్వీకరించాలని సీజేకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు విద్యార్థులు.