Baltimore Bridge collapse: యూఎస్ బాల్టిమోర్ వంతెనను ఢీకొట్టిన నౌకలో సిబ్బంది అంతా భారతీయులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baltimore Bridge collapse: అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటైన బాల్టిమోర్ సమీపంలో కార్గో షిప్ ఫ్రాన్సిస్ స్కాట్‌కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో వంతెన కుప్పకూలింది. ఈ ఘటన జరిగే సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న కార్లు, అందులోని ప్రయాణికులు చల్లటి నీటిలో పడిపోయారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 948 అడుగుల కంటైనర్ షిప్ సింగపూర్ ఫ్లాగ్ కలిగిన డాలీ ఒక్కసారిగా వంతెనను ఢీకొట్టడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Viral Video : అరె ఎంట్రా ఇది.. గులాబ్ జామ్ తో ప్రయోగాలెంట్రా బాబు..
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే కంటైనర్ షిప్ డాలీ నౌకా సిబ్బంది అంతా భారతీయులే అని తెలుస్తోంది. పూర్తిగా 22 మంది ఇండియన్ క్రూ చేత ఈ నౌక నిర్వహింపబడుతోందని డాలీని అద్దెకు తీసుకున్న షిప్పింగ్ కంపెనీ మెర్స్క్ ధ్రువీకరించింది. అయితే, ఈ ఘటన వెనక ఎలాంటి విద్రోహక కార్యచరణ లేదని, ఘటన పట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కి వివరించామని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్నప్పుడే నౌక ప్రొపల్షన్(చోదక శక్తి)ని కోల్పోయిందని, నౌకా సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయినట్లు మేరీ ల్యాండ్ అధికారులను ఉద్దేశిస్తూ అక్కడి మీడియా వెల్లడించింది.
ఏఎఫ్‌పీ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. 300 మీటర్ల పొడవున్న నౌక వంతెనకు సంబంధించిన ఒక పాదాన్ని ఢీకొట్టింది. దీంతో దాదాపుగా 20 మంది వ్యక్తులు బ్రిడ్జిపై నుంచి పటాన్‌స్కో నదిలో పడిపోయినట్లు భావిస్తున్నారు. నౌక శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. 1977లో మేరీల్యాండ్ లోని బాల్టీమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్‌కీ వంతెన నిర్మితమైంది. అమెరికా జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి పేరుతో ఫ్రాన్సిస్ స్కాట్‌కి పేరు పెట్టారు. ప్రస్తుతం బ్రిడ్జిని ఢీకొట్టిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
The Francis Scott Key Bridge in Baltimore, Maryland which crosses the Patapsco River has reportedly Collapsed within the last few minutes after being Struck by a Large Container Ship; a Mass Casualty Incident has been Declared with over a Dozen Cars and many Individuals said to… pic.twitter.com/SsPMU8Mjph
— OSINTdefender (@sentdefender) March 26, 2024
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!