Site icon NTV Telugu

Viral video: నడిరోడ్డుపై ఈవ్‌టీజర్‌ను చితకబాదిన యువతులు

Upvideo

Upvideo

ఒక ఈవ్‌టీజర్‌కు నడిరోడ్డుపైనే ఇద్దరు యువతులు బుద్ధి చెప్పారు. కారులో వెళ్తుండగా బుల్లెట్ రైడర్ వేడిపించాడు. అంతే అతగాడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. కారు ఆపి.. యువకుడ్ని అడ్డుకున్నారు. దిగి దిగగానే ఈవ్‌టీజర్ చెంపలు వాయించారు. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు మొబైల్‌లో ఈ సీన్‌ను చిత్రీకరించాడు. యువతులు ఎదురుదాడి చేయడంతో యువకుడు బుల్లెట్ వదిలేసి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన యూపీలో జరిగింది.

ఇది కూడా చదవండి: Bangladesh: బంగ్లాదేశ్ పరిణామాలు భారత వస్త్ర, పత్తి పరిశ్రమలపై ఎలా ప్రభావం చూపిస్తోంది..?

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని హుకుల్‌గంజ్‌లోని లాల్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి.. కారులో వెళ్తున్న అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చేశాడు. అసభ్యకరమైన మాటలు మాట్లాడడంతో గొడవకు దిగారు. అంతే యువకుడిని యువతులిద్దరూ దాడి చేశారు. దీంతో అతగాడు బుల్లె్ట్ వదిలేసి పరారయ్యాడు. అనంతరం యువతులు బుల్లెట్‌ను కింద పడేశారు. లాల్‌పూర్ ప్రాంతంలోని సిద్ధేశ్వరి మాత ఆలయం సమీపంలో జరిగిన ఈ మొత్తం ఎపిసోడ్‌ను బాటసారుడు కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ స్పీచ్ హైలైట్స్

Exit mobile version