Maharashtra: ‘మహా’ ఘోరం.. 180 మందిపై లైంగిక దాడి.. నిందితుడి ఇల్లు కూల్చివేత
- మహారాష్ట్రలో ఘోరం
- 180 మందిపై యువకుడి లైంగిక దాడి
- నిందితుడి ఇల్లు కూల్చేసిన అధికారులు
- దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడలేని మహా ఘోరం మహారాష్ట్రలో వెలుగుచూసింది. 19 ఏళ్ల మహ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అత్యంత దారుణాలకు ఒడిగట్టాడు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 180 మంది బాలికలను ట్రాప్ చేసి.. వేర్వేరు రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాలికల అశ్లీల దృశ్యాలు కూడా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన యావత్తు దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది.
అమరావతి జిల్లాలోని పరత్వాడా పట్టణానికి చెందిన తన్వీర్ ‘‘లవ్ ట్రాప్’’ పేరుతో బాలికలను ముగ్గులోకి దింపేవాడు. అనంతరం ముంబై, పుణె నగరాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు 350 అసభ్య వీడియోలు కూడా చిత్రీకరించాడు. వీటిని అడ్డంపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వ్యభిచార కూపంలోకి దింపేవాడు. వాట్సాప్, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా మైనర్ల బాలికలను లక్ష్యంగా చేసుకుని ట్రాప్‌లో దింపేవాడు. అయితే ఈ విషయం రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే దృష్టిలో పడడంతో అతగాడి కీచక పర్వం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తన్వీర్ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read
ఏప్రిల్ 11న తన్వీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భయంకరమైన దారుణాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు 180 మంది బాలికలపై అత్యాచారం చేయగా.. 350 అసభ్య వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 14న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 7 రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఉజేర్ ఖాన్ అనే నిందితుడు జరిగిన నేరాలను పూసగుచ్చినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తన్వీర్ మొబైల్‌ను పరిశీలిస్తున్నారు. వీడియోలను ఇంకెవరితోనైనా పంచుకున్నాడా? ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడి ఇల్లు కూల్చివేత
ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక అధికారులు కూడా యాక్షన్‌లోకి దిగారు. అమరావతి జిల్లాలోని పరత్వాడా పట్టణంలో ఉన్న నిందితుడి ఇల్లును జేసీబీతో కూల్చివేశారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ తాయడే సమక్షంలో ఇంటిని కూల్చేశారు. ఇంటి బయట నిర్మించిన ఇనుప మెట్లను కూడా తొలగించారు. అచల్పూర్ మున్సిపల్ కౌన్సిల్ అధికారుల సమక్షంలో ఈ పనులు జరుగుతున్నాయి. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
ఎంఐఎం..
తన్వీర్‌కు గతంలో ఎంఐఎంతో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు స్పందించారు. తన్వీర్‌కు పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని అమరావతి ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ ముజీబ్ తెలిపారు. ఇంతక ముందే తన్వీర్‌ను పార్టీ నుంచి తొలగించినట్లుగా వెల్లడించారు.
#LATEST : Bulldozer Action in Achalpur After 19-Year-Old’s Arrest in Amravati for Sexually Abusing 180 Children and Making 350 Videos
A 19 year old youth Ayan Ahmed Tanveer has been arrested by the police for allegedly sexually exploiting as many as 180 minor girls and filming… pic.twitter.com/3lgRrg74k9
— upuknews (@upuknews1) April 15, 2026
తాజావార్తలు
-
Trump: భారత్ ఎన్నికల వ్యవస్థ సూపర్.. ట్రంప్ ప్రశంసలే.. ప్రశంసలు
-
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
-
IND vs SL 1st Test: గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
-
OG 2 నుంచి వరుస ట్రీట్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మాస్ కిక్ స్టార్ట్!
-
Sreeleela : శ్రీలీలను వెంటాడుతున్న దురదృష్టం
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!