Lose Eyesight: రాజస్థాన్ రాష్ట్రంలో 18 మంది కంటి చూపును కోల్పోయారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన సవాయ్ మాన్ సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ఆపరేషన్ తర్వాత ఈ 18 మంది కంటి చూపును కోల్పోయినట్లు ఆరోపిస్తున్నారు. కంటి శుక్లాలకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తామంతా చూపు కోల్పోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వీరిలో చాలా మంది రాజస్థాన్ ప్రభుత్వం చిరంజీవి ఆరోగ్య పథకం కింద ఆపరేషన్లు చేశారు.
Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం.. మూన్ మిషన్ స్పెషల్ రిపోర్ట్..
జూన్ 23న ఆపరేషన్ చేసి జులై 5 వరకు కంటిచూపు అంతా కనిపించింది కానీ జూలై 6-7 నుంచి కంటిచూపు పోయింది.. ఆ తర్వాత మళ్లీ ఆపరేషన్ చేసినా కంటిచూపు రాలేదని ఓ పేషెంట్ చెప్పాడు. కంటి చూపు పోవడానికి ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు చెప్పారని, ఇన్ఫెక్షన్ని నయం చేసేందుకు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారని రోగి చెప్పాడు. తీవ్రమైన కంటి నొప్పి వస్తుందని రోగులు ఫిర్యాదు చేయడంతో రోగుల్ని వెంటనే ఆస్పత్రిలో చేరాలని అధికారులు కోరారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కొందరికి రెండుసార్లు చికిత్స చేసిన పోయిన చూపు తిరిగి రాలేదు. ఆసుపత్రిలోని ఆప్తాల్మాలజీ విభాగం అధికారులు తమ వైపు నుండి ఎటువంటి లోపం లేదని పేర్కొన్నారు. రోగుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
