దేశ వ్యాప్తంగా మావోల ఏరివేతకు కేంద్రం పూనుకుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో తిష్ట వేసిన మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇక ఇటీవల కాలంలో మావోలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. కర్రెగట్టులో పదుల కొద్ది మావోలు చనిపోయారు. ఇటీవల అగ్ర నేత నంబాల కేశవరావు కూడా హతమయ్యాడు.
ఇది కూడా చదవండి: HFC : సంతానలేమికి శాశ్వత పరిష్కారం: డాక్టర్ స్వప్న చేకూరి నేతృత్వంలోని HFCలో ఆశలకు కొత్త శ్వాస
ఇలాంటి తరుణంలో ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 10 మందిపై గతంలో రూ.38 లక్షల రివార్డు ఉంది. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు మావోయిస్టులు లొంగిపోయారు.
ఇది కూడా చదవండి: Rajya Sabha Polls: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు.. పెరగనున్న ఇండియా కూటమి బలం
గత సోమవారం నారాయణపూర్‌లో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు తలలపై కలిపి రూ.4.5 లక్షల రివార్డు ఉంది. వీరిలో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరి తలపై ఒక్కొక్కరికి రూ. లక్ష రివార్డు ఉంది. ఒకప్పుడు వివిధ ప్రాంతీయ కమిటీల్లో చురుకుగా పనిచేసిన ఈ మహిళలు.. సంవత్సరాల తరబడి కష్టాలు మరియు మావోయిస్టు భావజాలంపై పెరుగుతున్న భ్రమలు కారణంగా హింసాత్మక జీవితాన్ని విడిచిపెట్టాలనే కోరికను వ్యక్తం చేశారు. అధికారులు వారి నిర్ణయాన్ని స్వాగతించారు.
