Young Boy: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడు. అనూజ్ పాండే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. తల తిరగడంతో కిందపడిపోయాడని అందరూ భావించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే అనూజ్ గుండెపోటుతో మరణించి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. బంధువులు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో అనూజ్‌కు అంత్యక్రియలు పూర్తిచేశారు.
Read Also: Shocking Video: వేరే వ్యక్తితో మాట్లాడుతుండగా రైల్వే టీసీపై తెగిపడిన కరెంట్ వైర్
అనూజ్ తండ్రి అమిత్ కుమార్ పాండే త్రివేణిగంజ్ మార్కెట్‌లో సీడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నారు. అమిత్‌కు భార్య సునీత, ఇద్దరు కుమారులు సుమిత్, 16 ఏళ్ల అనూజ్ ఉన్నారు. తన కుమారుడు అనూజ్ బుధవారం ఉదయం తన స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు ఇంటి నుండి బయలుదేరాడని అమిత్ పాండే చెప్పారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు అనూజ్ మైకం కారణంగా స్పృహ తప్పి పడిపోయాడని.. అతని స్నేహితులు అనూజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని వివరించారు. వారు తమ కుమారుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారని.. కానీ అక్కడ వైద్యులు అనూజ్ చనిపోయినట్లు ప్రకటించారని తెలిపారు. అనూజ్ క్రికెట్ ఆడుతుండగా పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడు అతనికి తల తిరగడంతో పాటు ఛాతీ నొప్పి వచ్చిందని, ఆ తర్వాత అతను నేలపై పడిపోయాడని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఈ మేరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యుడు గణేష్ ప్రసాద్ అనూజ్ మరణానికి గుండెపోటు కారణమని స్పష్టం చేశారు.
