NTV Telugu Site icon

Mumbai: దాగుడుమూతలు ఆడుతూ 16 ఏళ్ల బాలిక మృతి

Lift Accident

Lift Accident

16-year-old dies while playing hide-and-seek in lift: దాగుడుమూతలు ఆడుతూ.. 16 ఏళ్ల బాలిక మరణించింది. ఈ విషాదకరమైన సంఘటన ముంబైలో జరిగింది. లిఫ్టులో దాగుడుమూతలు ఆడటమే బాలిక ప్రాణాలను తీసింది. ముంబైలోని మాన్ ఖుర్డ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. రేష్మా ఖరవీ అనే బాలిక దీపావళి పండగ జరుపుకోవడానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బాలిక చనిపోయింది.

Read Also: Pulwama Attack: పుల్వామా దాడిని సెలబ్రేట్ చేసుకున్న విద్యార్థికి ఐదేళ్లు జైలు శిక్ష

బాలిక తన స్నేహితులతో దాగుడుమూతలు ఆడుతున్న సమయంలో లిఫ్ట్ లో ఎవరైనా దాక్కున్నారని గమనించేందుకు లిఫ్ట్ లో ఉన్న కిటీకి లాంటి నిర్మాణం నుంచి తలను పెట్టి చూసింది. ఈ సమయంలో లిప్ట్ కిందకు దిగడంతో బాలిక తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. హౌౌసింగ్ సొసైటీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ప్రమాదాలు జరగకుండా లిఫ్ట్ కిటికీలకు అద్దాలు బిగించాలని బాధితురాలి తండ్రి రవి ఖరవి డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో హౌసింగ్ సొసైటీ చైర్మన్, సెక్రటరీలను విచారిస్తున్నామని మన్ ఖుర్డ్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

గతంలో కూడా ఇలాంటి లిఫ్టు ప్రమాదాలే జరిగాయి. ముంబైలో నెల క్రితం ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ కూడా ఇలాగా లిఫ్టు ప్రమాదానికి గురై చనిపోయారు. ఉపాధ్యాయురాలు తన క్లాసులు ముగించుకుని ఆఫీసు రూంకు వెళ్తున్న సమయంలో లిఫ్టులో ఇరుక్కుని మరణించింది. 26 ఏళ్ల జెనెల్ ఫెర్నాండెస్ తన బ్యాగ్ పట్టుకున లిఫ్టు ఎక్కే క్రమంలో లిఫ్టు డోర్లు అకాస్మత్తుగా మూసుకోవడంతో బ్యాగు ఇరుక్కుపోయింది. జెనెల్ సగం శరీరం లిఫ్టు మధ్యలో ఇరుక్కుంది. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో మరణించింది.