Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లిన తొలి భారతీయుడిగా, అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా రికార్డ్ క్రియేట్ చేశారు. శనివారం, శుక్లా ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడారు. ‘‘ఈ రోజు మీరు మన మాతృభూమికి దూరంగా ఉన్నారు. కానీ మీరు భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారు’’ని మోడీ, శుక్లాను ప్రశంసించారు. దీనికి సమాధానంగా శుక్లా మాట్లాడూతూ..‘‘ఇది నా ఒక్కడి ప్రయాణం కాదని, మన దేశానికి అని’’ అన్నారు.
Read Also: Operation Sindoor: భారత్ దెబ్బతో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం.. ఇండోనేషియా సెమినార్‌లో వెల్లడి..
ఇప్పటి వరకు తాను అంతరిక్షం నుంచి చూసిన వాటిని శుక్లా, ప్రధాని మోడీకి వివరించారు. ‘‘ఐఎస్ఎస్ నుంచి రోజూ 16 సార్లు సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూస్తాం. మన దేశం చాలా గొప్ప వేగంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ ప్రతీదీ భిన్నంగా ఉంది’’ అని అన్నారు. ‘‘మేము ఒక సంవత్సరం శిక్షణ పొందాము మరియు నేను వివిధ వ్యవస్థల గురించి నేర్చుకున్నాను… కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రతిదీ మారిపోయింది… ఇక్కడ, అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేనందున చిన్న విషయాలు కూడా భిన్నంగా ఉంటాయి… ఇక్కడ నిద్రపోవడం ఒక పెద్ద సవాలు… ఈ వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది’’ అని ప్రధానికి వివరించారు.
అంతరిక్షానికి చేరుకున్న తర్వాత మీ మొదటి ఆలోచన ఏంటని ప్రధాని , శుక్లాను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సరిహద్దులు కనిపించవు, భారత్ చాలా గొప్పగా పెద్దదిగా కనిపిస్తుందని చెప్పారు. మనం అంతరిక్షం నుంచి చూసినప్పుడు సరిహద్దులు లేవని, దేశాలు లేవని, మను ఉన్న ఏకైక ఇల్లు భూమి అని శుక్లా అన్నారు. రాబోయే 14 రోజుల పాటు శుక్లా ఐఎస్ఎస్‌లో గడుపుతారు.
