Site icon NTV Telugu

Sikkim: సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది ఆర్మీ జవాన్ల మృతి

Sikkim

Sikkim

16 Indian Army jawans killed in road accident in Sikkim: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లతో ప్రయాణిస్తున్న టక్కు లోయలో పడింది. ఉత్తర సిక్కిం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఏటవాలుగా ఉన్న రోడ్డు నుంచి ట్రక్కు జారిపోయి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది భారత జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. మూడు కాన్వాయ్ లు శుక్రవారం ఉదయం చటెన్ నుంచి థంగు వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. జెమా వద్ద కాన్వాయ్ లోని ఓ వాహనం మార్గం మధ్యలో ప్రమాదానికి గురైంది.

Read Also: Nikhil: హీరో అవ్వడానికి వారికి రూ. 5 లక్షలు ఇచ్చి మోసపోయాను..

మరణించిన వారిలో ముగ్గురు అధికారులు కూడా ఉన్నారు. ‘‘ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వారి సేవ మరియు నిబద్ధతకు దేశం ఎంతో కృతజ్ఞతలు తెలుపుతోంది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’’ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

Exit mobile version