నిన్న ఆపఘనిస్తాన్ నుంచి భారతదేశానికి తరలించిన 78 మందిలో 16 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా, మొత్తం 78 మందిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. తాలిబాన్ ల ఆక్రమణ తర్వాత మరింత దిగజారుతుంది అక్కడి భద్రతా పరిస్థితి. భారత్ పౌరులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ ను వీడిపోవాలనుకుంటున్న ఆదేశ పౌరులను సైతం తరలించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది భారతదేశం. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి 228 మంది భారతీయ పౌరులతో సహా, మొత్తం 626 మందిని తరలించినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. వారిలో 77 మంది ఆఫ్ఘన్ సిక్కులు ఉన్నారని కేంద్ర మంత్రి తెలిపారు.
ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వారిలో 16 మందికి కరోనా పాజిటివ్…
