Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆమె శరీరంలో 150 మిల్లిగ్రాముల వీర్యం ఉందని, ఇది సామూహిక అత్యాచారాన్ని సూచిస్తోందని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టుకి తెలిపారు. దీనిని సీబీఐకి బదిలీ చేయాలని ఆమె తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేశారని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని వారు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘‘తమ కుమార్తె శరీరంపై అనేక గాయాలు ఉన్నాయి. ఇది క్రూరమైన, హింసాత్మక దాడినిసూచిస్తోంది’’ అని వారి పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధితురాలి తలలో అనేక గాయాలు ఉన్నా సంకేంతాలు కనిపించాయి. ఆమె రెండు చెవులకు గాయాలు కావడం, ఆమె నిందితుడితో పోరాడినట్లు సూచిస్తోంది. ఆమె పెదవులపై గాయాలయ్యాయి. దాడి సమయంలో ఆమె నిశ్శబ్ధంగా ఉండేందుకు ఇలా చేయవచ్చు అని పిటిషన్లు కోర్టుకు విన్నవించారు. ఆమె మెడపై కొరికన గుర్తులు కనిపించాయని, ఇది దాడి తీవ్రతను తెలియజేస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Read Also: Kolkata doctor Case: “ఒంటిపై దుస్తులు లేవు, తీవ్రగాయాలు”.. అయినా, ఆత్మహత్య అని చెప్పారు..
పోస్టుమార్టం నివేదిక ప్రకారం, ఆమె శరీరంలో గణనీయమైన స్థాయిలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని తేలింది. దీనిని బట్టి చూస్తే ఆమెపై ఎక్కువ మంది అత్యాచారం చేసిన అనుమానాలను బలపరుస్తోందని పిటిషన్ పేర్కొంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘తమ కుమార్తె సామూహిక అత్యాచారానికి గురైనట్లు సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ, ఇతర నేరస్థులను అరెస్ట్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే చేసే నేరం కాదు ఇది’’ అని వైద్యురాలి తల్లిదండ్రులు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ కుమార్తె గొంతు నులిమి హత్య చేసిన ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు రికార్డుల్లో ఆధారాలు ఉన్నాయని విశ్వసనీయ మూలాల ద్వారా తెలుసుకున్నామని తల్లిదండ్రులు చెప్పారు.
ఆర్‌జీ కల్ మెడికల్ కాలేజీ హస్పిటల్ సేఫ్టీకి బాధ్యత వహించే ప్రిన్సిపాల్, ఇతర సంబంధిత అధికారులను ఇంకా పట్టుకోలేదరి తల్లిదండ్రలు కోర్టుకు తెలిపారు. నిన్న ఈ కేసుని విచారించిన కోల్‌కతా హైకోర్టు ఆస్పత్రి పరిపాలనపై మండిపడింది. ముఖ్యంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌పై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ చనిపోయిన తర్వాత ఆసుపత్రి అధికారులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అధిపతి పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత డాక్టర్ ఘోష్‌ను మరో మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా నియమించడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అది నిలదీసింది.