Site icon NTV Telugu

The Auto Driver Assaulted The Girl: 14ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్‌ అఘాయిత్యం.. కాలువిరగొట్టి రోడ్డుపై పడేసిన వైనం

The Auto Driver Assaulted The Girl

The Auto Driver Assaulted The Girl

తన మేన మామ యింటి వెళుతున్న ఓ మైనర్‌ బాలికపై ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పాడిన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో రామ్‌గఢ్ ప్రాంతంలోని తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు బాలిక మధ్యాహ్నం 3.40 గంటలకు బసుకినాథ్ బస్టాండ్‌కు చేరుకుంది. ఆమైనర్‌ బాలిను గమ్యస్థానానికి తీసుకెళ్తానని ఓఆటో డ్రైవర్‌ ముందుకొచ్చాడు. అప్పటికే అందులో మరొక అమ్మాయి కూర్చుంది. అయితే.. అరగంట ప్రయాణం చేసిన తర్వాత డ్రైవర్ వారిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లాడు. వారు ఎక్కడికి అని ప్రశ్నించగా.. ఆప్రదేశంలో వారిని కిందికి దిగమని వారిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. ఆటోలో ఉన్న మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది.

దీంతో.. 14 ఏళ్ల బాలిక అతని చేతికి చిక్కింది. ఆబాలికపై అత్యాచారానికి పాల్పడుతుండటంతో.. ఆబాలిక ప్రతిఘటించింది. దీంతో ఆబాలికను అతను తీవ్రంగా కొట్టాడు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన పడేశాడు. ఆబాలిక కాళ్లు విరిగిన బాలిక కదలలేని స్థితిలో రాత్రంతా అక్కడే ఉండిపోయింది. ఉదయాన్నే కాళ్లు ఈడ్చుకుంటూ సహాయం కోరుతూ కేకలు వేసింది. ఆబాలికను స్థానికులు గుర్తించి మహిళా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆటోడ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
Astrology : ఆగస్టు 22, సోమవారం దినఫలాలు

Exit mobile version