NTV Telugu Site icon

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి, 25 మందికి గాయాలు..

Assam

Assam

Assam: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం గోలాఘాట్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 25 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్ సమపంలోని బలిజన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ రాజేస్ సింగ్ తెలిపారు.

Read Also: ED: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు..

బస్సు గోలాఘాట్ జిల్లాలోని కమర్‌బంధ ప్రాంతం నుంచి తీన్సుకియా జిల్లాలోని తిలింగ మందిర్ వైపు వెళ్తోంది. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద స్థలంలోనే 10 మంది మరణించారు. మరో ఇద్దరు జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.