NTV Telugu Site icon

మిజోరాంలో క‌రోనా విజృంభ‌ణ‌…128 మంది చిన్నారుల‌కు కోవిడ్‌…

దేశంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి.  ద‌క్షిణాదిన కేర‌ళ‌తో పాటు అటు మ‌హారాష్ట్ర‌, ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నాయి.  మొద‌టివేవ్‌ను స‌మ‌ర్ధవంతంగా ఎదుర్కొని త‌క్కువ కేసుల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఈశాన్య రాష్ట్రాలు సెకండ్ వేవ్ స‌మ‌యంలో అనేక ఇబ్బందులు ప‌డ్డాయి.  ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో అక్క‌డ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  తాజారా మిజోరాం రాష్ట్రంలో 576 కొత్త కేసులు న‌మోద‌వ్వ‌గా అందులో 128 మంది చిన్నారులు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  థ‌ర్డ్ వేవ్ ముప్పు చిన్నారుల‌కు ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని ఇప్ప‌టికే నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  క‌రోనా సోకుతున్న చిన్నారుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  దీంతో థ‌ర్డ్ వేవ్ ఎంట‌రైందా అనే సందేహాలు క‌లుగుతున్నాయి.  మిజోరాం రాజ‌ధాని ఐజ్వాల్‌లో కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.  

Read: వైర‌ల్‌: జ్యూసులు, వంట‌లు చేస్తున్న పిల్లులు… ల‌క్ష‌ల్లో వ్యూస్…