Jackal attack: యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు.. దాడిలో 12 మంది గాయాలు..
- యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు..
- ఇప్పటికే తోడేళ్ల దాడిలో 8 మంది మృతి..
- తాజాగా పిలిభిత్‌లో నక్కల దాడి..
- 12 మందికి తీవ్రగాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jackal attack: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తోడేళ్ల దాడులు కలవరపెడుతున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు బహ్రైచ్ జిల్లాలో వరసగా గ్రామాలపై దాడులకు తెగబడుతున్నాయి. జూలై నుంచి ఇప్పటి వరకు 8 మందిని చంపేశాయి. ఇందులో ఏడుగురు పిల్లలే ఉన్నారు. 30 మందిని గాయపరిచాయి. ప్రస్తుతం ఈ మ్యాన్ ఈటర్స్‌ని పట్టుకునేందుకు ఏకంగా ప్రభుత్వం 200 మంది అటవీ, పోలీస్ అధికారుల్ని రంగంలోకి దించింది. ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించినప్పటికీ, దాడులు ఆగడం లేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేసింది.
Read Also: Deepika Singh : పండగవేళ పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకునే..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, ఇప్పటికే తోడేళ్ల దాడుల వార్తలు సంచలనంగా మారిన వేళ, నక్కలు కూడా దాడులకు తెగబడుతున్నాయి. రాష్ట్రంలోని పిలిభిత్ జిల్లాలో రెండు గ్రామాల్లో నక్కలు దాడులు చేశాయి. ఐదుగురు చిన్నారులతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జహనాబాద్ ప్రాంతంలోని సుస్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులుపై నక్కలు మొదటి దాడి చేశాయి. చిన్నారులను రక్షించేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా అటాక్ చేశాయి.
దాడి తర్వాత గాయపడిన మొత్తం 12 మందిని జహనాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్చారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది. నక్కల దాడిలో కోపోద్రిక్తులైన స్థానికులు అందులో ఒక దానిని చంపారు. నక్కల దాడి గురించి తెలిసిన వెంటనే స్థానిక అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తుున్నారు. నక్కల దాడిపై పిలిభిత్ ఎంపీ జతిన్ ప్రసాద అధికారులతో మాట్లాడారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!