రాజస్థాన్‌లోని సికార్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కల్వర్టును బస్సు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Triumph: ఇండియాలో 2025 ట్రయంఫ్ టైగర్ 1200 రిలీజ్.. ధర, ఫీచర్లు ఇవే
మంగళవారం సుజన్‌గఢ్ నుంచి నవల్‌గఢ్‌కు వెళ్తుండగా బస్సు కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 36 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లక్ష్మణ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. క్షతగాత్రులను లక్ష్మణ్‌గఢ్‌లోని ఆస్పత్రికి తరలించారు. పలువురి ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన ప్రయాణికులకు మంచి వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Blood Donate: రక్తదానంతో ఎన్ని లాభాలో..!