Site icon NTV Telugu

MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి

Mp1

Mp1

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడి పోయింది. దీంతో 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Baba Horror: అమ్మాయి నచ్చితే ప్రత్యేక గది.. ఖరీదైన సెల్‌ఫోన్లు.. వెలుగులోకి ఢిల్లీ బాబా దురాగతాలు

ట్రాక్టర్ అబ్నా నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. 14 మంది మునిగిపోయి ఉంటారని భావిస్తున్నారు. స్థానిక గ్రామస్తుల సహాయంతో అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాంధాన పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జమాలి సమీపంలోని సంఘటనాస్థలిలో జిల్లా పరిపాలన బృందాలు చురుకుగా పనిచేస్తున్నాయి. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (గ్రామీణ) అభిషేక్ రంజన్ మాట్లాడుతూ, 12 ఏళ్ల బాలుడు అనుకోకుండా ట్రాక్టర్ ఇగ్నిషన్ కీని తిప్పాడని.. దీంతో ట్రాక్టర్ స్టార్ట్ అయి ముందుకు కదిలిందని చెప్పారు. విగ్రహాలతో నిండిన ట్రాలీ వంతెనపై నుంచి నదిలోకి జారిపోయిందని పేర్కొన్నారు. ట్రాక్టర్‌లో ఉన్నవారంతా మునిగిపోయారని చెప్పారు.

మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

 

 

Exit mobile version