Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, 11 మంది మృతి..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగై జిల్లాలోని కుమ్మంగుడి సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపత్తూర్ ప్రాంతంలోని పిళ్లైయార్‌పట్టికి 5 కి.మీ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Also: Madhya Pradesh: ఆదర్శంగా సీఎం కుమారుడు.. సామూహిక వివాహా వేడుకలో పెళ్లి..

ప్రమాదానికి గురైన బస్సులు తిరుప్పూర్ నుంచి కరైకుడి వెళ్తుండగా, మరొకటి కరైకుడి నుంచి దిండిగల్ జిల్లాకు వెళ్తోంది. అత్యవసర బృందాలు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. ప్రమాదంలో బస్సులు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు అందులోనే చిక్కుకుపోయారు. రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికులు వీరిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి కారణం, ఆసుపత్రిలో చేరిన వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. గత వారం, తెన్కాసి జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న తరువాత ఆరుగురు మరణించారు

Exit mobile version