Chabdrayaan-3: చంద్రయాన్-3 విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంలో భారత్ చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఈ ఘనతను అమెరికా, రష్యా, చైనాలే సాధించాయి. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడిపైకి వెళ్లిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ పనిని మొదలు పెట్టాయి.
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్యఎల్ 1 అంతరిక్ష నౌకను విజయవంతంగా లాంచ్ చేసిన కొద్దిసేపటికే ఇస్రో చంద్రయాన్-3పై కీలక అప్డేట్ అందించింది. ప్రజ్ఞాన్ రోవర్ చందమామ ఉపరితలంపై 100 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో వెల్లడించింంది. ‘100 నాటౌట్’ అంటూ ఇస్రో ట్వీట్ చేసింది.
Read Also: Vaccine: చిన్న పిల్లలే కాదు.. పెద్దలు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ లు కూడా ఉన్నాయి
ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై ప్రయాణిస్తూ, అక్కడి నేలను అణ్వేషిస్తోంది. చంద్రుడి దక్షణ ధృవంపై ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తెలియజేసింది. ఇదిలా ఉంటే చంద్రుడిపై సల్ఫర్, ఆక్సిజన్ ఉన్నట్లు చంద్రయాన్-3 మిషన్ ద్వారా తెలిసింది. ఈ రెండు మూలకాలతో పాటు ఇనుము, క్రోమియం, సిలికాన్ వంటి మూలకాల ఉనికిని కూడా కనుగొంది. హైడ్రోజన్, హీలియం నిల్వల కోసం వేట సాగుతోంది.
చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచంలో అంతరిక్ష వ్యాపారంలో ఇస్రో కీలక ముందగుడు వేసింది. రాబోయే దశాబ్దంలో ప్రపంచ స్పేస్ మార్కెట్ వాటాలో ఐదు రెట్లు పెరుగుదలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులనున తెరవాలని చూస్తోంది.
Chandrayaan-3 Mission:
🏏Pragyan 100*
Meanwhile, over the Moon, Pragan Rover has traversed over 100 meters and continuing. pic.twitter.com/J1jR3rP6CZ
— ISRO (@isro) September 2, 2023
