Nitish Kumar: బిహార్ యువతకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ ప్రతిష్టాత్మక వాగ్దానానికి మద్దతు ఇస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు ఒక అడుగు ముందుకు వేశారు. మొత్తం ఉద్యోగావకాశాలు చివరికి రెట్టింపు అవుతాయని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడారు. జేడీయూ- ఆర్జేడీ కూటమి ప్రభుత్వంలో కనీసం 10లక్షల ఉద్యోగాలతో పాటు అదనంగా 10లక్షల మందికి ఉపాధి కల్పించాలనే భావన ఉందన్నారు. వివిధ రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
AP CM Jaganmohan Reddy: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
రాష్ట్రంలో యువతుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి తాము కృషి చేస్తున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. తాము 10లక్షల ఉద్యోగాలు ఇచ్చిన అనంతరం.. వాటిని 20లక్షలకు తీసుకెళ్లేందుకు కూడా యత్నిస్తామని ఆయన అన్నారు. ఇందు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన 10 లక్షల ఉద్యోగాల వాగ్దానాన్ని ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అన్నారు. తన ఉద్యోగాల వాగ్దానానికి ముఖ్యమంత్రి ఆమోదం లభించిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ గతంలో చెప్పారు.
