Site icon NTV Telugu

UPI Payments: ఇక ఈ 10 దేశాల ఎన్ఆర్ఐలు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..

Upi

Upi

10 Countries Will Soon Let Non-Resident Indians Make UPI Payments: భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్లను సులభతరం చేసింది యూపీఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వీధిలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు పేమెంట్లు అన్నీ క్యాష్ లెస్ గా మారాయి. కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లావాదేవీలు చేయడానికి. ఇటీవల యూపీఐని విస్తృతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్పీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐ)లు కూడా యూపీఐ చేయడానికి వెసులుబాటు కల్పించింది.

Read Also: Chiranjeevi: నా మీద విష ప్రయోగం చేసింది నా సొంత..

భారతబ్యాంకులు కలిగి ఉండీ.. ఇతర దేశాల్లో నివాసం ఉంటూ అక్కడి మొబైల్ నెంబర్లను వాడుతున్న వారికి ఈ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం 10 దేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలకి మాత్రమే ఇది అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ లోగా దీనికి అనుగుణంగా మార్పులు చేయాలని పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే ఇతర యూపీఐ భాగస్వాములకు ఎన్పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూపీఐ సిస్టమ్ ఎన్ఆర్ఈ-ఎన్ఆర్ఓ ఖాతాలు, కొన్ని దేశాల అంతర్జాతీయ మొబైల్ నెంబర్ కలిగిన వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం కింద పేర్కొన్న 10 దేశాల ఎన్ఆర్ఐలు యూపీఐని ఉపయోగించుకోవచ్చు.

ఆస్ట్రేలియా: +61

కెనడా: +1

హాంకాంగ్: +852

ఒమన్: +968

ఖతార్: +974

సౌదీ అరేబియా: +966

సింగపూర్: +65

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: +971

యునైటెడ్ కింగ్‌డమ్: +44

అమెరికా: +1

ఎన్ఆర్ఐలకి యూపీఐ సేవలు అందించడానికి యూపీఐ ఎకో సిస్టమ్ లోని బ్యాంకులు కొన్ని షరతులను పాటించాలని ఎన్పీఆర్ఐ తెలిపింది. అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లతో కూడిన ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ ఖాతాలు ప్రస్తుతం ఉన్న ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనలు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఏవైనా మార్గదర్శకాలు/సూచనలకు అనుగుణంగా ఉండాలి. యాంటీ-మనీ లాండరింగ్ (ఏఎంఎల్)/ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ (సీఎఫ్టీ) తనిఖీలను చేయాలని సూచించింది. గూగుల్ పే వంటి ప్లాట్ ఫారమ్ లో యూపీఐ ఐడీని సృష్టించడానికి 10 అంకెల మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డిసెంబర్ 2022 నాటికి 382 భాగస్వామి బ్యాంకులను కలిగి ఉంది. 2016 ఆగస్టులో యూపీఐని ప్రవేశపెట్టారు. ఇటీవల యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.12.82 లక్షలకోట్లకు చేరుకుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డీఎఫ్ఎస్) ప్రకారం డిసెంబర్, 2022 వరకు 782 కోట్ల లావాదేవీలు జరిగాయి.

Exit mobile version