Site icon NTV Telugu

Kochi: కొచ్చిలో అర్ధరాత్రి ప్రమాదం.. పగిలిన భారీ నీటి ట్యాంక్.. ఇళ్లు జలమయం

Kochi

Kochi

కేరళలోని కొచ్చి అకస్మాత్తుగా జలఖడ్గం విరుచుకుపడింది. తుఫాన్ కారణంగానో.. లేదంటే భారీ వరదలు కారణంగానో కాదు. ఊహించని రీతిలో అర్ధరాత్రి వచ్చిన పెను ముప్పు కారణంగా మొత్తం ఇళ్లను ముంచేశాయి. దీంతో వాహనాలు, వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాపాయం తప్పినా.. భారీగా నష్టమైతే జరిగింది.

ఇది కూడా చదవండి: Bihar Elections: రేపే మలి విడత పోలింగ్.. బూత్‌లకు చేరుకుంటున్న సిబ్బంది

ఆదివారం-సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయం. ప్రజలంతా మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి కొచ్చిలోని 1.35 లక్షల కోట్ల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో ఒక్కసారి జలప్రవాహం ఇళ్లను ముంచెత్తింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తేరుకునేలోపే ఇళ్లు మునిగిపోయాయి. వస్తువులు కొట్టుకుపోయాయి. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. అందరూ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని.. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Bhopal: భోపాల్‌లో ఘోర విషాదం.. రోడ్డుప్రమాదంలో ఆసియా కప్ విజేత దుర్మరణం

40 ఏళ్ల క్రితం కొచ్చిలోని తమ్మనంలోని కుతప్పడి ఆలయానికి సమీపంలో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. అయితే సామర్థ్యం కోల్పోయిందో.. ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా ట్యాంక్ పేలిపోయింది. దీంతో నీరంతా ఇళ్లల్లోకి వచ్చేసింది. గోడలు, అనేక నిర్మాణాల భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాలు సహా పలు సైకిళ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి రాళ్లు, బురద వచ్చేయడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం నివాసితులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇక అధికారులు ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు.

Exit mobile version