Site icon NTV Telugu

జంతువుల‌పై క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌భావం…

దేశంలో సెకండ్‌వేవ్ ప్ర‌భావం చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది.  వేగంగా వ్యాక్సినేష‌న్ వేస్తున్నారు.  ఈ స‌మ‌యంలో మ‌రో న్యూస్ అంద‌రిని భ‌య‌పెడుతున్న‌ది.  ఇటీవ‌ల చెన్నై జూలో రెండు సింహాలు వైర‌స్‌తో మృతి చెందాయి. దీంతో సెంట్ర‌లో జూ అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.  జంతువుల‌కు క‌రోనా టెస్టులు చేయాల్సిన విధానంపై చర్చించారు.  జూలోని జంతువుల‌కు మాత్ర‌మే కాకుండా ఇంట్లో పెంపుడు జంతువుల‌కు కూడా క‌రోనా సోకే అవ‌కాశాలు ఉండటంతో మార్గ‌ద‌ర్శ‌కాలను రిలిజ్ చేశారు.  వైర‌స్ బారిన పడిన జంతువుల‌ను మిగ‌తా వాటి నుంచి దూరంగా ఉంచాలి.  జంతువుల నోటి నుంచి న‌మూనాల‌ను సెక‌రించే స‌మ‌యంలో త‌ప్ప‌ని స‌రిగా పీపీఈ కిట్లు ధ‌రించాలి.  ఆహారం అందించే స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకొవాల‌ని తెలిపారు.  

Exit mobile version